తాను నటించిన సినిమా విడుదల ప్రకటన కార్యక్రమానికి తనను పిలకవపోవడంపై నటుడు విద్యుత్ జమ్వాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఏడు బాలీవుడ్ సినిమాల్ని ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. ఇందుకోసం సోషల్‌మీడియా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏడు సినిమాలకు గానూ ఐదు సినిమాల చిత్రబృందాలే పాల్గొన్నాయి. మిగతా రెండు చిత్రాల చిత్రబృందాలకు ఆహ్వానం అందలేదు. వాటిలో విద్యుత్ నటించిన 'ఖుదా హఫీజ్'కూడా ఉంది. దీంతో నిర్వాహకులపై విద్యుత్ అసహనం వ్యక్తం చేశారు.
విడుదల ప్రకటన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ "ఇది పెద్ద ప్రకటన. ఏడు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. కానీ కార్యక్రమానికి ఐదు సినిమాలే ప్రాతినిధ్యం వహించాయి. మిగతా రెండు సినిమాలకు ఆహ్వానం అందలేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఇది చాలా దూరం వెళ్తుంది. 'ది సైకిల్ కంటిన్యూస్'అని ట్వీట్ చేశారు.