తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వాడు నీళ్లలా కనిపించే వోడ్కా: రష్మిక మందణ్న - రష్మిక మంధాన

టాలీవుడ్​లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న రష్మిక మందణ్న తాజాగా నటించిన చిత్రం 'గీతా ఛలో'. ఈ సినిమా ట్రైలర్​ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం.

వాడు నీళ్లలా కనిపించే వోడ్కా- రష్మిక మంధాన

By

Published : Apr 14, 2019, 1:21 PM IST

తెలుగులో 'ఛలో, గీత గోవిందం, దేవదాస్‌' సినిమాల్లో నటించి అలరించింది కన్నడ భామ రష్మిక మందణ్న. కోలీవుడ్​ నటుడు గోల్డెన్​ స్టార్​ గణేష్​, రష్మిక కాంబినేషన్​లో తెరకెక్కిన ‘గీతా–ఛలో’ ఈ నెల 26న తెలుగులో విడుదల కానుంది.

ఈ సినిమా ఆడియో ఏప్రిల్​ 17న విడుదల కానుంది. ఏప్రిల్‌ 21న విశాఖపట్నంలో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించనున్నారు. వీకెండ్‌ పార్టీలు యువతకు మంచి చేస్తున్నాయా? చెడు చేస్తున్నాయా? అనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

ఈ చిత్రాన్ని దివాకర్‌ సమర్పణలో శ్రీ రాజేశ్వరి ఫిలింస్‌ – మూవీమ్యాక్స్‌ బ్యానర్లపై... మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్‌ సంయుక్తంగా విడుదల చేయనున్నారు.
విజయ్​ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న డియర్​ కామ్రేడ్​ చిత్రంలోనూ రష్మిక హీరోయిన్.

ABOUT THE AUTHOR

...view details