తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ డైరెక్టర్​కు అప్పుడే చెక్​ ఇచ్చేసిన అల్లు అరవింద్ - palasa 1978 director

దర్శకుడు కరుణ కుమార్​ తీసిన 'పలాస 1978' విడుదలకు ముందే గీతా ఆర్ట్స్​తో సినిమా చేసేందుకు అంగీకరించాడు.

ఆ డైరెక్టర్​కు అప్పుడే చెక్​ ఇచ్చేసిన అల్లు అరవింద్
అల్లు అరవింద్ దర్శకుడు కరుణ కుమార్​

By

Published : Mar 5, 2020, 2:21 PM IST

'పలాస 1978' దర్శకుడు కరుణ కుమార్ జాక్​పాట్ కొట్టేశాడు. చిత్ర విడుదలకు(మార్చి 6) ముందే అగ్రనిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్​తో కలిసి పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు. నిర్మాత అల్లు అరవింద్.. ఈ డైరెక్టర్​కు అప్పుడే చెక్ ఇచ్చేశాడు. ఆ ఫొటోలు సదరు నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది.

దర్శకుడు కరుణ కుమార్​తో నిర్మాత అల్లు అరవింద్

నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం 'పలాస 1978'. ఇప్పటికే వచ్చిన ట్రైలర్​పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుండగా, ఇప్పుడు అల్లు అరవింద్-కరుణ్ కుమార్ సినిమా చేయనుండటం చర్చనీయాంశమైంది. మరి వీరిద్దరూ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకొస్తారో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details