అగ్రకథానాయకుడు బాలకృష్ణ(Balakrishna latest news).. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. బాలయ్య ప్రస్తుతం 'అఖండ' చేస్తుండగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో బాలయ్య ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని క్రేజీ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. క్రిష్.. బాలకృష్ణతో(Balakrishna latest news) గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలు తీశారు. మరోసారి క్రిష్, బాలకృష్ణ కలిస్తే మాత్రం ఫ్యాన్స్‌కు పండగే! అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు.
గీతా ఆర్ట్స్ బ్యానర్లో బాలయ్య కొత్త చిత్రం! - Balakrishna latest news
నందమూరి బాలకృష్ణ(Balakrishna latest news).. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో ఓ చిత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
బాలయ్య ప్రస్తుతం 'అఖండ' చిత్రంలో నటిస్తున్నారు. బాలకృష్ణ- బోయపాటి(balayya boyapati movies) కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇంతకుముందు 'సింహా', 'లెజెండ్' చిత్రాలతో బ్లాక్బస్టర్లు కొట్టిన వీరిద్దరూ.. ఇప్పుడు మూడో సినిమాతో తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో బాలకృష్ణ(balakrishna dialogues) సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ.. ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో కనిపించనున్నారు. తమన్(thaman songs) సంగీతమందించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు బాలయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.