అక్కినేని వారసుడు అఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఓ సరికొత్త కథా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందంటూ ఇటీవలే ప్రచారం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఈ చిత్ర హక్కులను కొనుగోలు చేసిందని నెట్టింట్లో వరుస పోస్టులు దర్శనమిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సదరు వార్తలపై చిత్రబృందం నుంచి ఓ క్లారిటీ వచ్చింది. ఫుల్ టైమ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేసింది. థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యాకే రిలీజ్ డేట్‌ను మరోసారి ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.