ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మేనన్ తెర వెనుకే కాదు తెర ముందు అలరిస్తుం టారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలతో పాటు ఇతర దర్శకుల చిత్రాల్లోనూ కనిపించి సందడి చేశారాయన. ఎక్కువగా పోలీస్ అధికారి పాత్రల్లో మెప్పించిన గౌతమ్ మేనన్.. మరోసారి అలాంటి పాత్రలో నటిస్తున్నారు.
గౌతమ్ మేనన్.. మరోసారి పోలీస్ పాత్రలో - vetrimaaran viduthalai vijaysethupathi
ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ 'విడుదలై' సినిమాలో గౌతమ్ మేనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

గౌతమ్ మేనన్.. మరోసారి పోలీస్ పాత్రలో
ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తీస్తున్న చిత్రం 'విడుదలై'. సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులోని ఓ శక్తిమంతమైన పోలీస్ అధికారిగా గౌతమ్ కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన ఓ పది రోజులు చిత్రీకరణలో పాల్గొన్నట్టు సమాచారం.