నిత్యం, సినిమాలు, షూటింగులు, ప్రచార కార్యక్రమాలు, ఫొటోషూట్లు.. ఇలా సినీ తారల జీవితం బిజీ బిజీ. కుటుంబంతో గడపడానికి సమయం తక్కువే. ఎంతో ప్లాన్ చేసుకుంటే కానీ కుదరదు. కరోనా ప్రభావంతో ఏర్పడిన లాక్డౌన్ సమయం చాలామంది సినీ తారలకు కుటుంబంతో హాయిగా గడిపే అవకాశం ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ షారుఖ్ఖాన్కూ ఆ అవకాశం చిక్కింది. కుటుంబంతో ఆనందంగా ఎంజాయ్ చేయడమే కాదు గరిట పట్టి కుటుంబసభ్యుల కోసం వంట కూడా చేశారట. ఈ విషయం గురించి ఆయన భార్య గౌరీఖాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
'లాక్డౌన్లో షారుఖ్ వంటను ఎంజాయ్ చేశా' - గౌరీ ఖాన్ వార్తలు
లాక్డౌన్లో బాలీవుడ్ స్టార్ షారుఖ్‌ఖాన్.. కుటుంబసభ్యులకు తానే స్వయంగా వండి పెట్టారని అతని భార్య గౌరీ ఖాన్ వెల్లడించారు. వంట చేయడాన్ని షారుఖ్ చాలా ఆస్వాదించారని.. అతని వంట తిని తాము ఎంజాయ్ చేసినట్లు ఆమె వెల్లడించారు.
'లాక్డౌన్లో షారుఖ్ వంటను ఎంజాయ్ చేశా'
"అందరం ఇంట్లోనే ఉన్నాం. అందరికీ వండాలంటే చాలా కష్టమే. నలుగురు కలిసి ఉన్నప్పుడే కదా సంతోషంగా తినేది. అలాగని బయట నుంచి ఆహారం తెప్పించుకోవడం అంత మంచిది కాదు. అప్పుడు మా వారు స్వయంగా రంగంలోకి దిగారు. మాకు నచ్చిన వంటలను వండిపెట్టారు. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆయన వంట చేయడాన్ని ఎంజాయ్ చేస్తే.. నేను ఆయన వండిన దాన్ని తిని ఎంజాయ్ చేశా" అని చెప్పారు గౌరీ.