తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా ఉన్నా షూటింగ్​కు వెళ్లిన నటి.. కేసు నమోదు - బాలీవుడ్ న్యూస్

కొవిడ్ సోకినప్పటికీ బాలీవుడ్ నటి, మోడల్​ గౌహర్ ఖాన్ షూటింగ్​లకు వెళ్లిపోయింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు అధికారులు. ఆ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

Gauahar Khan booked for shooting after testing positive for COVID-19
కరోనా ఉన్నా షూటింగ్​కు వెళ్లిన నటి.. కేసు నమోదు

By

Published : Mar 15, 2021, 3:42 PM IST

Updated : Mar 15, 2021, 4:12 PM IST

నటి గౌహర్ ఖాన్​పై ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కేసు పెట్టారు. కరోనా పాజిటివ్​గా తేలినప్పటికీ ఆమె షూటింగ్​కు హాజరు కావడమే ఇందుకు కారణం.

ఇటీవల గౌహర్ ఖాన్​కు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. హోం క్వారంటైన్​లో ఉండాలని బీఎమ్​సీ అధికారులు ఆమెకు సూచించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఇంటికి వెళ్లగా, గౌహర్ షూటింగ్​కు వెళ్లినట్లు వారు గుర్తించారు. దీంతో ఒసివారా పోలీస్​స్టేషన్​లో ఆమెపై కేసు పెట్టారు.

మోడల్​ గౌహర్ ఖాన్

నగర భద్రత విషయంలో రాజీపడే సమస్యే లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో సదరు నటిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రజలందరూ ఈ వైరస్​ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

ఇది చదవండి:చిరకాల మిత్రుడితో చిరంజీవి సిక్కిం టూర్

Last Updated : Mar 15, 2021, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details