51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో తెలుగు సినిమా 'గతం'కు గుర్తింపు లభించింది. ఈ చిత్రోత్సవంలోని ఇండియన్ పనోరమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ప్రదర్శితం కానున్న ఏకైకా తెలుగు సినిమాగా నిలిచింది.
నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి కిరణ్ కొండమడుగుల దర్శకత్వం వహించారు. భార్గవ పోలుదాసు, రాకేష్ గాలేభే, పూజిత కురపర్తి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల స్వరాలు అందించారు.