తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గణేశుడికి బై బై చెప్పిన బాలీవుడ్​ తారలు! - ganesh chaturdhi news updates

బాలీవుడ్​ తారలు షారుఖ్​, శిల్పా శెట్టి, శ్రద్ధా కపూర్​లు గణనాథుడికి వీడ్కోలు తెలుపుతూ.. నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.

Ganpati Visarjan
బాలీవుడ్​

By

Published : Aug 24, 2020, 1:52 PM IST

Updated : Aug 24, 2020, 2:10 PM IST

ఈ ఏడాది గణేశ్​ నిమజ్జన కార్యక్రమంలో పలువురు బాలీవుడ్​ తారలు పాల్గొన్నారు. సూపర్​స్టార్​ షారుఖ్​ ఖాన్​ గణనాథుడికి భక్తి శ్రద్ధలతో వీడ్కోలు పలికారు. ప్రతి ఒక్కరికీ గణేశ్​ కృపతో అడ్డంకులు తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు ఇన్​స్టాగ్రామ్​ వేదికగా షారుఖ్​ పేర్కొన్నారు.

శిల్పాశెట్టి, శ్రద్ధాకపూర్​ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే తొట్టెలో లంబోదరుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశారు. గణేశ్​కు వీడ్కోలు చెప్పడం చాలా కష్టంగా ఉందని.. ఈ ఏడాది ఎంతో నిశ్శబ్దంగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చిందని శ్రద్ధా కపూర్​ పేర్కొంది.

ఆగస్టు 22న ప్రారంభమైన గణేశ్​ చతుర్థి వేడుకలు.. 10 రోజుల పాటు సాగనున్నాయి. చివరి రోజు విగ్రహాలను నిమజ్జనం చేసి ఉత్సవాలు ముగిస్తారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా విధించిన ఆంక్షల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా నిరాడంబరంగా పూజలు అందుకున్నాడు గణనాథుడు.

Last Updated : Aug 24, 2020, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details