మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఖిలాడి'. 'వీర' చిత్రం తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా ఇది. ఏ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. రవితేజ సరసన నాయికలు మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఏప్రిల్ 12న ఉదయం 10.08 నిమిషాలకు ఈ ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేస్తామని వెల్లడించింది.
'ఖిలాడి' టీజర్ అప్డేట్.. 'గంగూబాయ్' తెలుగు టీజర్ - గంగూబాయ్ తెలుగు టీజర్ అప్డేట్
రవితేజ హీరోగా నటిస్తోన్న 'ఖిలాడి' టీజర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. అలాగే ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'గంగూబాయ్ కతియావాడి' తెలుగు టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది.
ఖిలాడి టీజర్ అప్డేట్.. గంగూబాయ్ తెలుగు టీజర్
ఆలియా భట్ హీరోయిన్గా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న చిత్రం 'గంగూబాయ్ కతియావాడి'. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన హిందీ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్ర తెలుగు టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దీనిని పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' రిలీజైన థియేటర్లలో ప్రదర్శించనున్నారు.