*'ఆర్ఆర్ఆర్'(RRR) బ్యూటీ ఆలియా భట్(Alia Bhatt) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'గంగూబాయ్ కతియవాడి'(Gangubai Kathiawadi). ఈ చిత్ర షూటింగ్ ఆదివారంతో పూర్తయింది. ఈ సందర్భంగా ఇన్స్టాలో భావోద్వేగ పోస్టు పెట్టిన ఈమె.. పలు ఫొటోల్ని షేర్ చేసింది. ముంబయి కామటిపురలో గతంలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు.
*'100 క్రోర్స్'(100 CRORES teaser) సినిమా టీజర్ అలరిస్తోంది. నోట్ల రద్దు సమయంలో నల్లధనం ఉన్న కొందరు వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు? కొత్త నోట్లను దొంగతనం చేయాలనుకున్న వారి ఎత్తుగడ ఫలించిందా? లేదా అనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. కల్పిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్ ప్రధాన పాత్రలో నటించారు.