నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా 'గ్యాంగ్‌లీడర్'. ఫస్ట్‌లుక్‌తో అంచనాల్ని పెంచిన ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేసింది చిత్రబృందం. రారా అంటూ సాగే గీతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఆగస్టు 30న థియేటర్లలోకి రానుంది.
రా.. రా.. అంటున్న 'గ్యాంగ్‌లీడర్' - గ్యాంగ్లీడర్లోని రారా పాట
నాని 'గ్యాంగ్‌లీడర్' సినిమాలోని రారా అంటూ సాగే గీతం గురువారం విడుదలైంది. అనిరుధ్ సంగీతమందించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో నానితో పాటు మరో ఐదు కీలక పాత్రలున్నాయి. అందులో ఓ పాప, ఇద్దరు యువతులు, మధ్య వయస్కురాలు, వృద్ధురాలు ఉన్నారు. వీరితో కథానాయకుడు ఎవరిపై ప్రతీకారం తీర్చుకున్నాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. 'ఆర్.ఎక్స్ 100' హీరో కార్తికేయ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.