నేచురల్ స్టార్ నాని ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'గ్యాంగ్ లీడర్'. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.
టీజర్ చూస్తుంటే సినిమా ఫన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. నాని మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. త్వరలో షూటింగ్ పూర్తిచేసి ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.