నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గ్యాంగ్‌లీడర్'. విలన్‌పై పగ తీర్చుకునేందుకు వచ్చిన ఐదుగురు ఆడవాళ్లకు ఓ రచయిత సహాయపడితే ఎలా ఉంటుంది అనే వినూత్న కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. 'పెన్సిల్' అనే రైటర్‌గా నాని కనిపించనున్నాడు. ఇతర పాత్రల్లో లక్ష్మీ, శరణ్య, ప్రియాంక... ప్రతినాయకుడిగా కార్తికేయ నటించాడు. తాజాగా ఈ చిత్రంలోని 'గ్యాంగ్‌లీడర్' అనే ప్రమోషనల్ పాటను విడుదల చేసింది చిత్రబృందం.
'గ్యాంగ్‌లీడర్' పాటతో కథ లీక్ చేశారు.. - gang leader
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం 'గ్యాంగ్ లీడర్'. ఈ సినిమాలో 'గ్యాంగ్‌లీడర్' అనే ప్రమోషనల్ పాటను విడుదల చేసింది చిత్రబృందం.
సినిమా
ఈ పాటలో సినిమాలోని పాత్రల తీరును వివరించారు. ఈ సాంగ్‌కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. విక్రమ్.కె.కుమార్ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇవీ చూడండి.. 'మీకు మాత్రమే చెప్తా' టీజర్ వచ్చేది రేపే
Last Updated : Sep 29, 2019, 2:02 PM IST