తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఐదుగురు అమ్మాయిల 'గ్యాంగ్​లీడర్' నాని - ప్రియాంక అరుళ్ మోహన్

హీరో నాని 'గ్యాంగ్​లీడర్'​ సినిమా ప్రీ లుక్​ ఆసక్తి రేపుతోంది. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్. ఆగస్టు 30న సినిమా విడుదల కానుంది.

ఐదుగురు అమ్మాయిల 'గ్యాంగ్​లీడర్' నాని

By

Published : Jul 13, 2019, 12:14 PM IST

Updated : Jul 13, 2019, 12:47 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'గ్యాంగ్​లీడర్'. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు.. ప్రీలుక్​తో సర్​ప్రైజ్​ ఇచ్చింది చిత్రబృందం. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్​గా నటిస్తోంది.

ఈ ఫొటోలో నాని చేతిలో ఇంకో ఐదుగురు అమ్మాయిలు చేతులు వేసి, ఓ లక్ష్యం కోసం ప్రమాణం చేస్తున్నట్లుగా ఉంది. ఈ లుక్​ ఆసక్తి రేపుతూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. వారికి 'గ్యాంగ్​ లీడర్'గా నాని కనిపిస్తాడా? ఇంతకీ వారి లక్ష్యం ఏంటి? తదితర ప్రశ్నలు అభిమానుల మనసును తొలిచేస్తున్నాయి. వీటన్నింటికీ సమాధానాలు కావాలంటే చిత్రం విడుదలకు వరకు ఆగాల్సిందే.

వీటితో పాటే సినిమాకు సంబంధించిన ఇతర విషయాల్ని వెల్లడించారు. ఫస్ట్ లుక్ 15న, తొలిపాట 18న, టీజర్ 24న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు' అని అంటున్న హీరో నాని

Last Updated : Jul 13, 2019, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details