వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా గీతా ఆర్ట్స్ కార్యాలయంలో గణనాథుడి విగ్రహానికి పూజలు చేశారు. శనివారం నిమజ్జన కార్యక్రమాన్ని గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ కథానాయకుడు అల్లు అర్జున్ సతీసమేతంగా పాల్గొన్నాడు. గణనాథుడికి వీడ్కోలు చెబుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేశ్ నిమజ్జన పూజా కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
గణేశుడి సన్నిధిలో అల్లు ఫ్యామిలీ - geeta arts
గీతా ఆర్ట్స్ కార్యాలయంలోని గణనాథుడి విగ్రహ నిమజ్జన కార్యక్రమానికి అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరయ్యాడు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అల్లు అర్జున్
అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' అనే చిత్రంలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయిక. హారిక, హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. వర్చువల్ గేమ్‌తో వస్తున్న అవెంజర్స్ హీరోలు
Last Updated : Sep 29, 2019, 8:15 PM IST