లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. సినీ తారలంతా ఇళ్లకే పరిమితమై ఖాళీ సమయాన్ని కుటుంబంతో ఆస్వాదిస్తున్నారు. ఇక అగ్ర కథానాయకుడు మహేశ్ బాబు కూడా కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా తన కూతురు సితార, కొడుకు గౌతమ్‌లతో కలిసి టైమ్ పాస్ చేస్తున్నారు.
గౌతమ్‌తో కలిసి గేమ్ ఆడుతున్న మహేశ్ - Superstar Mahesh babu playing virtual tennis
లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు సినీ తారలు. కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు తన కొడుకు గౌతమ్‌తో కలిసి వర్చువల్ టెన్నిస్ ఆడుతూ సందడి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా తన కుమారుడు గౌతమ్‌తో కలిసి ఇంట్లో వర్చువల్‌గా టెన్నిస్ ఆడుతున్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు మహేశ్. కొడుకుతో కలిసి పోటీగా ఆడుతూ అందులో లీనమైపోయారు. షాట్స్ కొట్టినప్పుడు చిన్నపిల్లాడిలా ఎగురుతూ కనిపించారు. వెనక నుంచి సితార సలహాలిస్తుంటే, మైమరచిపోయి గేమ్ ఆడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది.
కేవలం కుటుంబ సభ్యులతో గడపడమే కాదు, లాక్‌డౌన్ వేళ అలుపెరగక విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పలు ట్వీట్లు చేస్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు ప్రిన్స్.