హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'గేమ్ ఓవర్'. టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ప్రచార చిత్రంలో తాప్సీని మాత్రమే చూపించారు. గేమ్స్ డిజైన్ చేసే అమ్మాయి పాత్రలో ఆమె కనిపించనుంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైనాట్ స్టూడియోస్ సంస్థ నిర్మాతగా వ్యవహరించింది.
ఆట ముగిసింది.. గెలుపు ఎవరిది? - గేమ్ ఓవర్ సినిమా
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న 'గేమ్ ఓవర్' టీజర్ విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఆట ముగిసింది.. మరి గెలుపెవరిది..?
‘మనకు రెండు జీవితాలు ఉంటాయి.. రెండోది మొదలయ్యే సరికి ఒక జీవితమే ఉందని అర్థం అవుతుంది’ అంటూ టీజర్‌లో కథ చెప్పే ప్రయత్నం చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రోన్ ఎథాన్ యోహన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇది చదవండి: సైకో నుంచి తమన్నా తప్పించుకుంటుందా?