తెలంగాణ

telangana

ETV Bharat / sitara

32 ఎమ్మీ నామినేషన్లతో గేమ్ ఆఫ్​ థ్రోన్స్​ రికార్డు - 71st

హాలీవుడ్ సిరీస్​ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్​'కు అవార్డుల నామినేషన్లు పోటెత్తుతున్నాయి. 2019 ఏడాదికి గాను అత్యధికంగా 32 ఎమ్మీ నామినేషన్లలో నిలిచి రికార్డు సృష్టించింది. 2011 నుంచి ప్రేక్షకులను అలరించిన ఈ వెబ్​సిరీస్​కు ఇప్పటికే 47 ఎమ్మీ అవార్డులు దక్కాయి.

గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​

By

Published : Jul 17, 2019, 9:02 AM IST

గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​కు అత్యధిక ఎమ్మీ నామినేషన్లు

టీవి అకాడమీగా పేరొందిన ఎమ్మీ అవార్డుల నామినేషన్లు మంగళవారం ప్రకటించారు. ప్రముఖ టీవి సీరీస్​ 'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్'​ అత్యధికంగా 32 నామినేషన్లతో రికార్డు సృష్టించింది. 2018, జూన్ 1 నుంచి 2019, మే 31 వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉత్తమ సిరీస్​లకు 2019 ఏడాదికి గాను ఎమ్మీ అవార్డులు ప్రదానం చేస్తారు. సెప్టెంబరు 22న అమెరికాలోని లాస్​ ఏంజేల్స్​లో 71వ ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

ఉత్తమ డ్రామా సిరీస్ విభాగం​తో పాటు ఇందులో నటించిన పాత్రధారులూ వ్యక్తిగతంగా నామినేట్ అయ్యారు. కిట్ హ్యారింగ్టన్ (జాన్ స్నో), ఎమిలీ క్లార్క్ (డెనేరియస్ టార్గేరియన్)​ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగంలో అవార్డుల రేసులో నిలిచారు. లీనా హెడే (సెర్సీ లానిస్టర్​), సోఫీ టర్నర్ (సాన్సా స్టార్క్​), మేసీ విలియమ్స్​ (ఆర్య స్టార్క్​), గ్వెండోలిన్ క్రిస్టీ (బ్రియన్ టార్త్) ఉత్తమ సహాయ నటి విభాగంలో పోటీలో నిలిచారు.

2011 నుంచి ప్రేక్షకుల్ని అలరించిన గేమ్ ఆఫ్ థ్రోన్స్​కు ఎక్కువ నామినేషన్లు రావడం ఇదే మొదటి సారి కాదు. ఇప్పటివరకు 167 ఎమ్మీ నామినేషన్లు అందుకుందీ సిరీస్​. అందులో 47 అవార్డులు సొంతం చేసుకుంది. ఈ ఏడాది వచ్చిన గేమ్ ఆఫ్ థ్రోన్స్​ చివరి సీజన్​ అత్యధికంగా 32 నామినేషన్లలో నిలిచింది.

ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందు వచ్చిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ చివరి సీజన్ మిశ్రమ స్పందనలు అందుకుంది. మొదటి ఏడు సీజన్లు ఘనవిజయాన్ని అందుకోగా ఆఖరి సీజన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అర్హత గల రచయితలతో స్క్రిప్ట్ పూర్తి చేయించి మళ్లీ రీ షూట్ చేయాల్సిందిగా పది లక్షల మంది సంతకాలు చేసి పిటిషన్ దాఖలు చేశారంటే ఈ సిరీస్​కున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోండి మరి.

ఇది చదవండి: బిగ్​బాస్​ వివాదంపై సినీ నటి హేమ ఏమన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details