అమెరికాలో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు టీవీల్లో ప్రసారమయ్యే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కు లీకుల సెగ తగులుతోంది. ప్రీమియర్ విడుదలకు ముందే వీడియోలు అంతర్జాలంలో దర్శనమిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఫైనల్ సిరీస్ నాలుగో ఎపిసోడ్ థాయ్‌లాండ్‌లో లీకైనట్లు ఆ దేశానికి చెందిన ఓ మీడియా సంస్థ వెల్లడించింది. చిత్రాలు నెట్టింట షేర్ అవగా విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని క్లిప్‌లు ట్విట్టర్, యూట్యూబ్‌లలో దర్శనమిచ్చాయని.. కానీ కొంత సమయం తర్వాత తొలగించినట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది.
'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కు లీకుల సెగ - 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కు లీకుల సెగ
'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చివరి సీజన్‌కు లీకుల బెడద తప్పడం లేదు. నాలుగో ఎపిసోడ్ ప్రీమియర్ ప్రసారం అవ్వడానికి ముందే అంతర్జాలంలో ప్రత్యక్షమైంది. ఇప్పటికే విడుదలైన మూడు ఎపిసోడ్లకు ఇదే పైరసీ సెగ తగిలింది.
'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కు లీకుల సెగ
ప్రధాన పాత్రకు సంబంధించిన 30 సెకన్ల వీడియో మాత్రమే నెట్టింట చక్కర్లు కొట్టిందని కొన్ని ఛానెళ్లలో వార్తలు వచ్చినా... నివేదికలు మాత్రం ఓ ప్రధాన సన్నివేశం సహా చాలా సీన్లు అంతర్జాలంలోకి వచ్చేసినట్లు వెల్లడించాయి.
- గత వారం విడుదలైన మూడో ఎపిసోడ్‌కు చెందిన కొన్ని చిత్రాలు బయటకు రావడం బాగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనలపై హెచ్‌బీఓ సంస్థ ప్రతినిధులు ఇంకా స్పందించలేదు. ఈ ఫైనల్ సిరీస్ నుంచి ఇంకా మూడు ఎపిసోడ్లు రానున్నాయి.
- మొదటి ఎపిసోడ్ ప్రీమియర్ విడుదలకు నాలుగు గంటల ముందే 'డైరెక్ టీవీ నవ్'లో కనిపించింది. జర్మనీలో అమెజాన్ ప్రైమ్ ద్వారా ముందే విడుదలైన రెండో ఎపిసోడ్‌ను... పైరసీ చేసి అమెరికాలో ప్రదర్శనకు ముందే నెట్టింట్లో విడుదల చేశారు.