తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో అట్టహాసంగా సినిమా షూటింగ్ ప్రారంభమైంది. శనివారం నాటికి చిత్రషూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీరామ్ ఆదిత్య చిత్రబృందంతో కలిసి దిగిన ఓ ఫొటోను సామాజిక మాద్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు.
విజయవంతంగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం. గల్లా జయదేవ్ ఈ రోజు సెట్స్‌కు రావడం మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది.