హాలీవుడ్ కథానాయిక గాల్ గాడట్ నటించిన సినిమా 'వండర్ ఉమెన్ 1984'. క్రిస్మక్ కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా 'వండర్ ఉమెన్ 3' రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రకటించింది. ఇందులోనూ 'వండర్ ఉమెన్ 1984' హీరోయిన్ గాల్ గాడట్యే ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు స్పష్టం చేసింది.
సరికొత్తగా రాబోతున్న 'వండర్ ఉమెన్ 3' - వండర్ ఉమెన్ సిరీస్
'వండర్ ఉమెన్' సిరీస్‌లో మూడో చిత్రాన్ని త్వరలోనే తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించింది నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్. ఇందులోనూ గాల్ గాడట్యే ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు తెలిపింది.
వండర్ ఉమెన్
తొలిసారిగా ఒక మహిళ దర్శకత్వం వహించిన సూపర్‌హీరో చిత్రం 'వండర్ ఉమన్'. 2017లో ఈ చిత్రం విడుదలైంది. దీనికి ప్యాటీ జెన్‌కిన్స్ దర్శకత్వం వహించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 821 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే 'వండర్ ఉమెన్ 1984' క్రిస్మస్కు విడుదలై హిట్ టాక్‌తో ఆడుతోంది.
ఇదీ చూడండి :'డబ్బు కోసమే షకీలా ఆ సినిమాలు చేసింది'