వరుణ్ తేజ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'వాల్మీకి'. అధర్వ మురళీ, మృణాలిని రవి కీలక పాత్రలో కనిపించనున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలోని 'గగన వీధిలో' అనే లిరికల్ సాంగ్ విడుదలైంది.
'కవిత నీవే.. కథవు నీవే.. కనులు నీవే' - mrinalini ravi
'వాల్మీకి' చిత్రంలోని 'గగన వీధిలో' పాట విడుదలైంది. వనమాలి రాసిన లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
గగన
ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించాడు. "గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపులా" అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. అనురాగ్ కులకర్ణి, శ్వేతా సుబ్రహ్మణ్యన్ ఆలపించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. వైరల్: రణ్బీర్-ఆలియా పెళ్లి ఫొటో..!
Last Updated : Sep 29, 2019, 1:33 PM IST