తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాయి తేజ్​ హెయిర్​ స్టైల్​పై వరుణ్​ కామెంట్​! - varun tej movie udpates

మెగా మేనల్లుడు సాయి తేజ్​తో చిన్నప్పుడు కలిసి తీసుకున్న ఓ ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే సాయి తేజ్ హెయిర్ స్టైల్​పై సరదా కామెంట్ పెట్టాడు వరుణ్.

Varun Tej
వరుణ్​, సాయి తేజ్

By

Published : Sep 1, 2020, 5:07 PM IST

Updated : Sep 1, 2020, 5:16 PM IST

మెగా హీరోలు వరుణ్​ తేజ్​, సాయి తేజ్​ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేరుకు బంధువులైనా.. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా కలిసి పెరిగారు. ఇప్పుడు ఇద్దరూ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే, తాజాగా సాయి తేజ్​ హెయిర్​ స్టైల్​పై వరుణ్​ తమాషాగా కామెంట్ పెట్టాడు.

ఇన్​స్టాగ్రామ్​ వేదికగా వరుణ్​ తన చిన్నప్పటి ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో అతని పక్కన సాయి తేజ్ కూడా​ ఉన్నాడు. ఈ క్రమంలోనే సాయి చిన్ననాటి హెయిర్​ స్టైల్​ అంటే తనకెంతో ఇష్టమని సరదాగా రాసుకొచ్చాడు వరుణ్​.

Last Updated : Sep 1, 2020, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details