తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రేక్షకుల దృష్టంతా ఈ జంటలపైనే! - farhan aktar latest news

బాలీవుడ్​లోప్రముఖ హీరో, హీరోయిన్లు తొలిసారి తెర పంచుకుని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో థియేటర్లలో సందడి చేస్తామంటూ వస్తున్న టాప్​-15 ఆన్​స్క్రీన్​ జంటలేవో తెలుసుకుందాం రండి.

From Prabhas & Deepika Padukone to Akshay Kumar & Manushi Chhillar, 15 on-screen pairs to look forward to
దీపిక, ప్రభాష్​

By

Published : Jul 21, 2020, 8:18 PM IST

రెబల్​ స్టార్​ ప్రభాస్​, బాలీవుడ్ హీరోయిన్​ దీపికా పదుకొణె కలిసి తొలిసారి తెర పంచుకోనున్నారు. ఇటీవలే చిత్రబృందం ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో వారంతంలో సామాజిక మాధ్యమాల టైమ్​లైన్స్​లో ఈ వార్త హాట్​టాపిక్​గా మారింది. ఈ క్రమంలోనే మరిన్ని బాలీవుడ్​ సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. 2021లో 'ఫోన్​ భూత్'​ అనే హారర్​ చిత్రం కూడా థియేటర్లలో భయపెట్టేందుకు రెడీ అవుతోంది. ఇందులో కత్రినా కైఫ్​, సిద్ధాంత్​ చతుర్వేది, ఇషాన్​ ఖత్తర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక అక్షయ్​ కుమార్​, ధనుష్​ , సారా అలీఖాన్​ త్రయంలో రానున్న చిత్రం 'అత్రాంగి రే'. ఆనంద్​​ ఎల్​ రాయ్​ ఈ సినిమాకు దర్శకుడు. వీరంతా తొలిసారి కలిసి నటించనున్నారు. ఈ క్రమంలోనే త్వరలో మొదటి సారి ఆన్​ స్క్రీన్​పై.. ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న బాలీవుడ్​ అగ్ర నటుల సినిమాలపై ఓ లుక్కేద్దాం రండి.

దీపిక, ప్రభాష్​

నాగ్​ అశ్విన్ దర్శకత్వంలో రెబల్​ స్టార్​ ప్రభాస్​, దీపికా పదుకొణె తొలిసారి జంటగా కనువిందు చేయనున్నారు. ఈ సినిమా టైటిల్​, కథాంశం గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం వెలువడలేదు. వైజయంతి మూవీస్​ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.

బాలీవుడ్​లో ఇప్పటివరకు వచ్చిన హారర్​ చిత్రాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే, ఈసారి తాను భయపెడతానంటూ దర్శకుడు గుర్మీత్​ సింగ్​ 'ఫోన్​ భూత్'​ తెరకెక్కిస్తున్నాడు. కత్రినా కైఫ్​, సిద్ధాంత్​ చతుర్వేది, ఇషాన్​ ఖత్తర్​ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. 2021లో ఈ మూవీ విడుదల కానుంది.

అక్షయ్​ కుమార్​, మానుషి చిల్లర్​

చంద్ర ప్రకాశ్​ ద్వివేది దర్శకత్వంలో రానున్న యాక్షన్​ డ్రామా చిత్రం 'పృథ్వీరాజ్​'. మాజీ మిస్​ వరల్డ్​ మానుషి చిల్లర్​, అక్షయ్​ కుమార్​ జంటగా ఇందులో నటించనున్నారు. మహారాజ పృథ్వీరాజ్​ చౌహాన్​ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించనున్నారు. ఈ ఏడాది దీపావళికి విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.

మృణాల్​ ఠాకూర్​, షాహిద్​ కపూర్​

'లవ్​ సోనియా', 'సూపర్ 30', 'బత్లా హౌస్​' వంటి వరుస విజయాల తర్వాత .. మృణాల్ ఠాకూర్​ 'జెర్సీ' చిత్రంలో నటించనుంది. ఇందులో షాహిద్​ కపూర్​ సరసన కనిపించనుందీ భామ. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్​ తిన్ననూరి.. హిందీలోనూ తెరకెక్కించనున్నాడు.

ఫర్హాన్​ అక్తర్​ సినిమా 'తుఫాన్​'లోనూ ఛాన్స్​ కొట్టేసింది మృణాల్​ ఠాకూర్​. స్పోర్ట్స్​ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో విడుదల కావాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.

ధనుష్​, అక్షయ్​ కుమార్​, సారా అలీఖాన్​

ఈ ఏడాది ప్రారంభంలో సారా అలీ ఖాన్​, అక్షయ్​ కుమార్​, ధనుష్​ త్రయంలో 'అత్రాంగి రే' అనే సినిమా ప్రకటించారు. ఆనంద్​ ఎల్ రాయ్ దర్శకత్వం వహించనున్నాడు. ఏఆర్​ రెహ్మాన్​ స్వరకర్త. ఈ సినిమా 2021లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

రణవీర్​ సీంగ్, షాలినీ పాండే

'అర్జున్ రెడ్డి' సినిమాలో ప్రీతిగా కనిపించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన షాలినీ పాండే.. ఇప్పుడు బాలీవుడ్​లో అడుగుపెట్టింది. యశ్​రాజ్​ ఫిలింస్ తెరకెక్కిస్తున్న 'జయేశ్ ​భాయ్​ జోర్దార్'​లో రణ్​వీర్​ సింగ్​ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరులో విడుదల కావాల్సి ఉంది.

బాలీవుడ్​లో సూపర్​హిట్​గా నిలిచిన 'దోస్తానా' సినిమా సీక్వెల్​ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీక్​ ఆర్యన్​, జాన్వీ కపూర్​ జంటగా నటించారు. కరోనా కారణంగా ఈ ఏడాదిలో సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది.

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మరో సీక్వెల్​ 'భూల్​ భులైయా'. కార్తీక్​ ఆర్యన్​, కియారా అడ్వాణీ హీరో హీరోయిన్లు​. 2020 జులైలో థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా.. కరోనా కారణంగా వాయిదా పడింది

బాలీవుడ్​లో సీక్వెల్​గా తెరకెక్కనున్న మరో సినిమా 'బంటీ ఔర్ బబ్లీ 2'. సిద్ధాంత్​ చతుర్వేది, షార్వారీ వాగ్​ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇందులో సైఫ్​ అలీఖాన్​, రాణి ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పరుణ్​ వి. శర్మ దర్శకుడు.

రణబీర్​ కపూర్​, ఆలియా భట్​

బాలీవుడ్​లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఇందులో ప్రేమజంట ఆలియా భట్​, రణబీర్​ కపూర్​లు కలిసి కనువిందు చేసేందుకు సిద్ధమయ్యారు. అయాన్​ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. కరణ్​ జోహర్​ నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్​, మౌని రాయ్​, కింగ్​ నాగార్జున కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ ఏడాది డిసెంబరులో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

వరుణ్​ ధావన్​, సారా అలీఖాన్​ జంటగా నటిస్తున్న చిత్రం 'కూలీ నెంబర్​.1'. 1995లో గోవింద, కరీష్మా కపూర్​ కలయికలో వచ్చిన సినిమాకు రీమేక్​గా అదే పేరుతో తెరకెక్కనుంది.

ఈ ఏడాది ఆన్​ స్క్రీన్​పై 'రూహి అఫ్​జానా' చిత్రంతో కనువిందు చేసేందుకు రెడీ అవుతున్న జంట రాజ్​కుమార్​ రావ్​, జాన్వీ కపూర్​.

'గుడ్​ న్యూస్' సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్న అక్షయ్​ కుమార్​, కియారా అడ్వాణీ జోడీ.. 'లక్ష్మీబాంబ్'​తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ చిత్రం 'కాంచన'కు ఇది రీమేక్​. డిస్నీ ప్లస్ హాట్​స్టార్​ ప్లాట్​ఫామ్​లో త్వరలో విడుదలకానుంది.

అనన్యా పాండే, ఇషాన్ ఖత్తర్​ జోడీగా థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న సినిమా 'కాలీ పీలీ'. 2018లో తెలుగులో వచ్చిన 'టాక్సీవాలా'కు ఇది రీమేక్​.

ABOUT THE AUTHOR

...view details