తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్వరలో పెళ్లిపీటలెక్కనున్న బాలీవుడ్ లవ్​బర్డ్స్​ వీరే! - Bollywood celebrity couples going to married 2021

బాలీవుడ్​లో ఎన్నో ప్రేమజంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటై తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నాయి. కొన్ని జంటలేమో ఇంకా డేటింగ్​లోనే ఉంటూ తమ బంధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్న లవ్​బర్డ్స్​ ఎవరో తెలుసుకుందాం!

Bollywood celebrity couples
బాలీవుడ్​ లవ్​బర్డ్స్

By

Published : Dec 6, 2020, 1:02 PM IST

ఇండస్ట్రీ ఏదైనా సెలబ్రిటీ ప్రేమ జంటలు ఉండటం ఖాయం. ముఖ్యంగా బాలీవుడ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ లవ్​ బర్డ్స్​లో ఏ జంట పెళ్లి పీటలెక్కుతుందో? ఏ జంట విడిపోయి మరో తోడు వెతుక్కుంటుందో చెప్పలేం. వీరిలో కొంతమంది పెళ్లిల్లు చేసుకుని హాయిగా జీవితం గడుపుతుండగా? మరికొందరు ఇంకా ప్రణయ బంధంలోనే ఉన్నామంటూ స్వేచ్ఛనిచ్చిన పావురాల్లా హాయిగా చట్టాపట్టాలేసుకుని నచ్చిన చోటల్లా వాలిపోతుంటారు. ఇందులో కొన్ని ప్రేమజంటలు తమ డేటింగ్​కు ఫుల్​స్టాప్​ పెట్టి 2021లో వివాహబంధంతో ఒక్కటయ్యే అవకాశముందని సమాచారం. వారెవరో తెలుసుకుందాం.

వరుణ్​-నటాషా

బాలీవుడ్​లో ప్రస్తుతం హాట్​ టాపిక్​గా మారింది హీరో వరుణ్‌ ధావన్‌ పెళ్లి. ఇతడు తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌ను వివాహం చేసుకోనున్నాడు. కొన్నేళ్ల నుంచి వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటించాడీ హీరో.

వరుణ్​-నటాషా

రిచా చద్ధా-అలీ ఫజల్

బాలీవుడ్​లో సీనియర్​ ప్రేమ జంట రిచా చద్ధా-అలీ ఫజల్​. వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతునట్లు ప్రకటించారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఈ వివాహ వేడుక వాయిదా పడింది. బహుశా వీరు వచ్చే ఏడాది మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే అవకాశముంది. డిసెంబర్​ 25 క్రిస్మస్​ రోజున 'షకీల' బయోపిక్​ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది రిచా.

రిచా చద్ధా-అలీ ఫజల్

ఆలియా భట్​-రణ్​బీర్​ కపూర్​

లవ్​బర్డ్స్​ ఆలియా భట్​-రణ్​బీర్​ కపూర్​ పెళ్లి టాపిక్​ పలుసార్లు తెరపైకి వచ్చింది. ఈ ఏడాది డిసెంబరులో డెస్టినేషన్​ వెడ్డింగ్​ ద్వారా వీరి పెళ్లి జరుగుతుందని వారి కుటుంబాలకు సన్నిహితుడైన ఓ వ్యక్తి తెలిపాడు. కానీ ఇంకా కరోనా ఉద్ధృతి ఉండటం వల్ల వేడుక ప్రణాళిక మారిందని తెలిసింది. మరి వీరు వచ్చే ఏడాదైన ఒక్కటవుతారో లేదో చూడాలి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి తొలిసారి జంటగా 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నారు.

ఆలియా భట్​-రణ్​బీర్​ కపూర్​

అర్జున్​-మలైకా

హీరో అర్జున్​ కపూర్​-నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో వేడుకల్లో జంటగా కనిపించి కెమెరా కంటికి చిక్కారు. కానీ వారి ప్రేమాయణంపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు. నిత్యం సోషల్​మీడియాలో తాము సన్నిహితంగా ఉండే ఫొటోలను పోస్ట్​ చేస్తూ తమ బంధం గురించి పరోక్షంగా తెలియజేస్తుంటారు. ఇటీవల దీనిపై స్పందించిన అర్జున్​.. ప్రస్తుతానికి తాము పెళ్లి చేసుకునే యోచనలో లేనట్లు తెలిపాడు. కానీ ఎప్పుడైనా జరగాల్సిందేగా అని అన్నాడు. ప్రస్తుతం అర్జున్​.. 'భూత్​ పోలీస్'​, 'సర్దార్​ అండ్​ గ్రాండ్​ సన్' సినిమాల్లో నటిస్తున్నాడు.

అర్జున్​-మలైకా

మలైకా 1998లో బాలీవుడ్​ అగ్ర హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు.. అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2017లో విడాకులు తీసుకుంది. వీరు విడిపోవడానికి అర్జున్‌ కారణమని ఒకప్పుడు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మోడల్‌ జార్జియా ఆండ్రియానితో అర్బాజ్‌‌ డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అర్జున్‌ కపూర్​ కంటే మలైకా దాదాపు పన్నెండేళ్లు పెద్దది కావడం గమనార్హం.

ఫర్హాన్​ అక్తర్​- షిబాని

ప్రముఖ నటుడు ఫర్హాన్​ అక్తర్​- షిబాని దండేకర్​ దాదాపు రెండేళ్ల నుంచి డేటింగ్​లో ఉన్నారు. కొద్దికాలం క్రితమే వీరి గుట్టు బయటపడింది. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాల్సింది. కానీ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి ఈ వేడుక వాయిదా పడిందని తెలిసింది. అయితే ఫర్హాన్​కు ఇప్పటికే పెళ్లై తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. ప్రస్తుతం అతడు.. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయ యాత్రికుడు రాకేశ్​ శర్మ బయోపిక్​లో నటిస్తున్నాడు. కాగా, షిబానీ ఐపీఎల్​ హాట్ యాంకర్‌గా అందరికీ సుపరిచితురాలు. హీరోయిన్స్ కన్నా ఎక్కువ వన్నెచిన్నెలు ఒలకబోస్తూ అటు మోడలింగ్‌లోనూ, ఇటు బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుంటుందీ అమ్మడు.

ఫర్హాన్​ అక్తర్​- షిబాని

ఇదీ చూడండి : ఈ ముద్దుగుమ్మలకు ఆ హీరోలంటే ఎంతిష్టమో!

ABOUT THE AUTHOR

...view details