'లార్గో వించ్'.. కొంత మందికి మాత్రమే పరిచయమైన సినిమా. ప్రస్తుతం ఈ చిత్రం సినీ ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. అందుకు కారణం 'సాహో'. ఈ రెండు చిత్రాలకు ఏం సంబంధం అనుకుంటున్నారా ?.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ప్రభాస్ 'సాహో' 'లార్గో వించ్'కు కాపీ అని చాలా మంది భావిస్తున్నారు.
తాజాగా 'లార్గో వించ్' దర్శకుడు జెరోమ్ సల్లే ఈ విషయంపై స్పందించాడు. పలువురు ఈ దర్శకుడిని సామాజిక మాధ్యమాల్లో ట్యాగ్ చేసి 'సాహో' గురించి ప్రస్తావించగా.. తనకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి కెరీర్ ఉంటుందని అనిపిస్తుందంటూ ట్వీట్ చేశాడు. అనంతరం మరొక ట్వీట్లో 'సాహో' చిత్రాన్ని విమర్శించాడు.