హాలీవుడ్ హీరోయిన్ ఫ్రిదా పింటో.. తన ప్రియుడు, అమెరికన్ ఫొటోగ్రాఫర్ కారీ ట్రాన్ పుట్టిన రోజున మరిచిపోలేని బహుమతిచ్చింది. అతడితో నిశ్చితార్థం చేసుకొని ఫొటోలను ఇన్స్టాలో షేర్ చెసిందీ ముద్దుగుమ్మ. తన జీవితంలో ట్రాన్ ఎంత ముఖ్యమో వివరిస్తూ ఓ వ్యాఖ్య జోడించింది.
"నా జీవితానికి అర్థం ఇదే. గతంలో కన్నీళ్లకు, పరీక్షలకు ఫలితం ఇదే. ప్రేమ గురించి పాత ప్రేమికులు చెప్పిన దానికి సారమిదే. ఇప్పుడు నేను ఎక్కడున్నానో, ఎక్కడికెళ్లాలని అనుకుంటున్నానో ప్రతి దానికి గమ్యమిదే. నా జీవితంలోకి అడుగుపెట్టి ఎప్పటికీ నిలిచి ఉండే అద్భుతం నువ్వే. ఇలాగే ఉండిపో. మనస్ఫూర్తిగా నీకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు"
-ఫ్రిదా పింటో, సినీ నటి