తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చెల్లి పెళ్లికి ప్రియుడితో కలిసి వచ్చిన ఫ్రిదా - Freida Pinto's Sister Gets MARRIED

'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ ఫ్రిదా పింటో ప్రియుడు కోరి ట్రాన్​తో కలిసి సందడి చేసింది. చెల్లి షరోన్ పింటో  పెళ్లికి వచ్చిన ఈ ప్రేమజంట వీక్షకులకు కనువిందు చేసింది.

Freida
ఫ్రిదా

By

Published : Dec 12, 2019, 8:33 PM IST

భారతీయ సంతతికి చెందిన అంతర్జాతీయ నటి ఫ్రిదా పింటో తన ప్రియుడు కోరి ట్రాన్‌తో కలిసి చెల్లెలు అయిన షరోన్‌ పింటో పెళ్లికి వచ్చింది. విదేశీ ఫొటోగ్రాఫర్‌ కోరి ట్రాన్‌తో గత నెల్లోనే నిశ్చితార్థం చేసుకొంది ఫ్రిదా పింటో.

బాయ్​ఫ్రెండ్​తో ఫ్రిదా

'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' చిత్రంతో వెండితెరపైకి వచ్చి అలరించింది పింటో. షరోన్‌ పింటో పెళ్లిలో ఫ్రిదా కాబోయో భర్త కోరితో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంట్లో అక్క పెళ్లి జరిగిన తరువాతే చెల్లెలు వివాహం జరుగుతుంది. కానీ ఇక్కడ అక్క (ఫ్రిదా) కంటే ముందే చెల్లెలు (షరోన్‌) తొందరపడిందని సినీజనాలు సరదాగా నవ్వుకుంటున్నారు. చెల్లి షరోన్‌ పింటో పెళ్లిలో ఫ్రిదా సంప్రదాయ దుస్తులతో ఒంటినిండా నగలు ధరించి అందంగా ముస్తాబై సందడి చేసింది.

ఫ్రిదా పింటో

ఇవీ చూడండి.. మాది గురుశిష్యుల సంబంధం: చిరు

ABOUT THE AUTHOR

...view details