కరోనా కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి మరో ముందడుగు వేశారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి తన పెద్ద మనసు చాటుకున్న ఆయన.. ఇప్పుడు తెలుగు చిత్రసీమ కార్మికులందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, అపోలో ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. సోమవారం ఈ టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది. కార్మికులతో పాటు సినిమా జర్నలిస్టులకు కూడా ఈ కార్యక్రమంలో వ్యాక్సిన్ వేయనున్నట్లు చిరు తెలిపారు.
Chiranjeevi: సినీ కార్మికులకు ఫ్రీ వ్యాక్సినేషన్ - movie news
కరోనా కష్టకాలంలో తనవంతు సాయం చేస్తున్న అగ్రకథానాయకుడు చిరంజీవి.. సినీ కార్మికులకు ఉచిత వ్యాక్సినేషన్‌ను మొదలుపెట్టారు. సోమవారం నుంచి ఈ కార్యక్రమం మొదలైంది.
చిరంజీవి
ప్రస్తుతం చిత్రసీమకు పెద్దన్నలా ఎవరికి ఏ ఆపద వచ్చినా చిరంజీవి తాను ఉన్నానంటూ ఆదుకుంటున్నారు. బ్లడ్‌బ్యాంక్, ఐ బ్యాంక్ పేరుతో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్నారాయన. కరోనా వల్ల ఆర్థికంగా నష్టపోయిన ఎంతోమంది కార్మికులకు ఫస్ట్‌వేవ్‌లో ఆయన ఉచితంగా రేషన్ పంపిణీ చేశారు. ఇప్పుడు ఆయన చేపట్టిన ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సినీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి:వైరస్ కంటే అదే చాలా ప్రమాదం: చిరంజీవి
Last Updated : Jun 7, 2021, 10:35 PM IST