తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీ కార్మికులకు ఉచిత టీకా: చిరంజీవి - సినీ కార్మికులకు ఉచిత టీకా: చిరంజీవి

45 ఏళ్లు పైబడిన సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు కరోనా క్రైసిస్ ఛారిటీ తరఫున ఉచితంగా వ్యాక్సిన్​ను అందిస్తున్నట్లు తెలిపారు మెగాస్టార్​ చిరంజీవి. ప్రముఖ ఆస్పత్రి అపోలో 247 సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.

chiranjeevi
చిరంజీవి

By

Published : Apr 20, 2021, 7:22 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలోని 45 ఏళ్లు పైబడిన సినీ కార్మికులను, సినీ జర్నలిస్టులను కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు మెగాస్టార్​ చిరంజీవి ముందుకొచ్చారు. కరోనా క్రైసిస్ ఛారిటీ తరఫున ఉచితంగా అందరికీ వ్యాక్సిన్ వేయించే సదుపాయం ప్రముఖ ఆస్పత్రి అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతూ దృశ్య సందేశాన్ని పంపారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా ఉపాధికి దూరమైన సినీ కార్మికులను ఆదుకునేందుకు గతేడాది తెలుగు చలన చిత్ర పరిశ్రమ కదిలివచ్చింది. మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన 'కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం' పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. నటీనటులు, దర్శక నిర్మాతలు ఇచ్చే విరాళాలను ఈ కమిటీ ద్వారా కార్మికుల సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు. వారికి నిత్యవసర వస్తువులు అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details