దాదాపు మూడువారాల పాటు కరోనాతో పోరాడిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఇటీవలే కోలుకున్నారు. ముంబయిలోని నానావతి ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టా వేదికగా కొన్ని కవితల్ని పోస్ట్ చేశారు. దీనితోపాటే కరోనా వైరస్‌ను ఫుట్బాల్లా తన్నిత ఫొటోను పంచుకున్నారు.
కరోనాను ఫుట్బాల్లా కిక్ చేసిన అమితాబ్! - Amitabh Bachchan latest news
కరోనాను జయించిన మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ కవితలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.
![కరోనాను ఫుట్బాల్లా కిక్ చేసిన అమితాబ్! Free from COVID-19, Amitabh Bachchan shares inspiring poems by his father](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8312201-585-8312201-1596685074119.jpg)
కవితలతో స్ఫూర్తిని పంచుతున్న బిగ్‌బీ
తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన 'అకెలెపాన్ కా బాల్', 'అగ్నిపత్', 'ధనుష్ ఉతా ప్రహార్ కర్' కవితలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు బిగ్‌బీ. వీటికి నెటిజన్ల నుంచి విశేషాదరణ లభిస్తోంది.
జులై 11న అమితాబ్, అభిషేక్ కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత జరిపిన పరీక్షల్లో బిగ్‌బీ కోడలు ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె ఆరాధ్యలకు వైరస్ సోకినట్లు తేలింది. వీరిద్దరూ త్వరగానే కోలుకున్నారు. ఇటీవలే అమితాబ్ మహమ్మారి నుంచి కోలుకోగా.. అభిషేక్ మాత్రం ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నారు.