ఫ్రెడ్డీ మెర్క్యూరీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంగీత దిగ్గజం. రాక్ మ్యూజిక్ చరిత్రలో గొప్ప సింగర్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 70, 80వ దశకాల్లో సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఫ్రెడ్డీ భారత సంతతికి చెందిన వ్యక్తి అని ఎంతమందికి తెలుసు? ఆయన బాల్యం ముంబయిలోనే గడిచింది. నేడు ఫ్రెడ్డీ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై ఓ లుక్కేద్దాం!
భారత తొలి రాక్‌స్టార్..
ఫ్రెడ్డీ మెర్క్యూరీ అసలు పేరు ఫరూఖ్ బల్సారా. భారత్‌కు చెందిన పార్శీ దంపతులు బోమి బల్సారా, జెర్ బల్సారాకు బ్రిటీష్ అధీనంలోని జాంజిబార్‌లో జన్మించాడు. ముంబయిలోని సెయింట్ పీటర్,సెయింట్ మేరీ పాఠశాలల్లో చదువుకున్నాడు. ఇక్కడే అతడి పేరును ఫ్రెడ్డీగా మార్చుకున్నాడు. స్కూల్లో ఉండగానే తన స్నేహితులతో కలిసి 'ద హెక్టిక్స్' అనే బ్యాండ్ ఏర్పాడు చేశాడు.
ఆల్బమ్‌లతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్..
అనంతరం 1970 లండన్‌లో నలుగురితో కలిసి 'క్వీన్' అనే రాక్ బ్యాండ్ ఏర్పాటు చేశాడు. ఈ బ్యాండ్ ద్వారా మర్చిపోలేని ఎన్నో పాటలకు ప్రాణం పోశాడు. 'కిల్లర్ క్వీన్, బొహిమియన్ రాప్సోడీ, సమ్‌బడీ టు లవ్, వీ ఆర్ ద ఛాంపియన్స్, డోన్ట్ స్టాప్ మీ నౌ, క్రేజీ లిటిల్ థింగ్ కాల్డ్ లవ్' లాంటి ఆల్బమ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.
అత్యధిక మంది పాల్గొన్న లైవ్ షో..