చిత్రపరిశ్రమలో తన శరీర ఛాయ గురించి వస్తున్న కామెంట్లపై తాజాగా స్పందించింది నటి బిపాసా బసు. 'చాలా సన్నగా', 'చాలా లావుగా' ఉన్నావంటూ బాడీ షేమింగ్ కామెంట్లతోనే పరిశ్రమలో పట్టుదలగా నిలబడినట్లు వెల్లడించింది. ఇలా తనపై ఎన్నో విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ముందుకు సాగానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
"చిత్రపరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో నేను సన్నగా ఉన్నానని అన్నారు. ఇప్పుడు చాలా లావుగా ఉన్నానని అంటున్నారు. ఇలాంటి కామెంట్లు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఆ వ్యాఖ్యల్లో మూర్ఖత్వం కనిపిస్తుంది. గోధుమ రంగు శరీరవర్ణం గల దేశంలో నేను పుట్టాను. కానీ, నా శరీర ఛాయ గురించి మాట్లాడటం నాకు నవ్వు తెప్పిస్తుంది. నేను తెల్లగా అవ్వటానికి ఎలాంటి ఉత్ప్రేరకాలు ఉపయోగించలేదు. నా శరీర ఛాయ మెరుగు కోసం స్కిన్ లైటనింగ్ చేయించుకున్నాననే రూమర్ల గురించి నేనూ విన్నాను. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాను".