తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్పోర్ట్స్​ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి కొడుకు - మాండ్య నిఖిల్

హీరో నిఖిల్ కుమార్ గౌడ.. బాస్కెట్​బాల్ నేపథ్య కథతో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా చిత్ర పోస్టర్​ను ఈరోజు(బుధవారం) విడుదల చేశారు.

స్పోర్ట్స్​ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి కొడుకు
హీరో నిఖిల్ కుమార్ గౌడ

By

Published : Jan 22, 2020, 2:13 PM IST

Updated : Feb 17, 2020, 11:42 PM IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.​డి కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమార్ గౌడ.. ఇప్పటికే శాండల్​వుడ్​లో హీరోగా పలు చిత్రాలు చేశాడు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఓ కొత్త ప్రాజెక్టులో నటిస్తున్నట్లు వెల్లడించాడు. బాస్కెట్​బాల్ కథాంశంతో ఈ సినిమా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్​ను పంచుకున్నారు. తెలుగు-కన్నడలో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

హీరో నిఖిల్ కుమార్ గౌడ
హీరో నిఖిల్ కుమార్ గౌడ కొత్త సినిమా పోస్టర్

'గుండెజారి గల్లంతయ్యిందే' ఫేమ్ విజయ్ కుమార్​ కొండ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ సంస్థ లహరి మ్యూజిక్.. ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. సంగీత దర్శకుడు అర్జున్ జన్య స్వరాలు సమకూర్చుతున్నాడు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Last Updated : Feb 17, 2020, 11:42 PM IST

ABOUT THE AUTHOR

...view details