తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భవిష్యత్తును చూస్తున్నా.. ఎంతో దూరంలో లేదు' - Sharukh khan

కరోనా లాక్​డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన బాలీవుడ్​ నటి కాజోల్​.. తాను ఔటింగ్​ను బాగా మిస్​ అవుతున్నట్లు సోషల్​మీడియాలో పేర్కొన్నారు. 'దిల్​వాలే దుల్హనియా లేజాయేంగే'​లోని ఓ చిత్రాన్ని షేర్​ చేస్తూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. సినిమా షూటింగ్​లు ప్రారంభమయ్యేందుకు ఎంతో సమయం లేదని అభిప్రాయపడ్డారు.

Flashback to when we dressed up to go out kajol shared old picture
ఆ రోజుల్లో అలా రెడీ అయ్యే వాళ్లం: కాజోల్​

By

Published : Jun 3, 2020, 10:13 AM IST

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్​తో సినీ సెలబ్రిటీలంతా రెండు నెలలుగా ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్​లు లేకపోవడం వల్ల కుటుంబంతో గడుపుతున్నారు. అయితే ఇటీవలె లాక్‌డౌన్‌ నిబంధనల్లో కొన్నింటికి సడలింపులు ఇచ్చింది కేంద్రం. అయినా సరే.. అవసరం ఉంటే తప్ప బయటికి రావొద్దని సూచించింది. ఈ నేపథ్యంలో కథానాయిక కాజోల్‌ ఔటింగ్‌ను మిస్‌ అవుతున్నారట. ఆమె మంగళవారం 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' స్టిల్‌ను షేర్‌ చేస్తూ.. 'మనమంతా బయటికి వెళ్లేందుకు తయారౌతున్న రోజుల్లో..' అని కామెంట్‌ చేశారు. ఈ ఫొటోకు నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు.

'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమా 1995లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకుంది. అంతేకాదు జాతీయ అవార్డుతోపాటు పలు పురస్కారాలు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో షారుక్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించారు. ఆదిత్యా చోప్రా దర్శకుడు. యశ్‌ చోప్రా నిర్మించారు. మనీష్‌ మల్హోత్రా కాస్ట్యూమ్స్ డిజైన్‌ చేశారు.

తన ఇంటి బాల్కనీలో నుంచి చూస్తున్న కాజోల్​

ప్రస్తుతం కాజోల్‌ తన కుటుంబంతో కలిసి ముంబయిలోని ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నారు. సోమవారం తన ఇంటి బాల్కనీలో తీసుకున్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. 'భవిష్యత్తును చూస్తున్నా.. చాలా దూరంలో లేదు..' అని క్యాప్షన్‌ ఇచ్చారు.

ఇదీ చూడండి...'తారక్​.. మీ అభిమానులు నన్ను వేధిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details