తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సిబ్బందిని తిట్టిన హీరో.. తప్పుకున్న ఐదుగురు! - టామ్ క్రూజ్ తిట్లు

హాలీవుడ్​ హీరో టామ్ క్రూజ్ కొత్త సినిమా నుంచి ఈ మధ్య ఏడుగురు సిబ్బంది తప్పుకున్నారు. సెట్​లో వారిని టామ్ తిట్టడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Five crew members quit Mission Impossible 7 after Tom Cruise unleashes another rant on set
సిబ్బందిని తిట్టిన హీరో.. తప్పుకున్న ఐదుగురు!

By

Published : Dec 17, 2020, 6:16 PM IST

'మిషన్ ఇంపాజిబుల్ 7' నుంచి ఐదుగురు సిబ్బంది తప్పుకున్నారు. అందులో నటిస్తున్న హీరో టామ్ క్రూజ్ వారిపై నోరు పారేసుకోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం రోమ్​లో షూటింగ్ సాగుతోంది.

'మిషన్ ఇంపాజిబుల్ 7' సెట్​లో టామ్ క్రూజ్

అసలు ఏం జరిగింది?

'మిషన్ ఇంపాజిబుల్ 7' చిత్రీకరణను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కొందరు ఫైర్ సిబ్బంది వాటిని అతిక్రమించారు. దీంతో వారిని టామ్ తిట్టారు. అందుకు సంబంధించిన ఆడియో లీకైంది. అదే విషయమై కోపంగా ఉన్న టామ్.. ఇప్పుడు సెట్​లో కొందరిపై నోరు పారేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా నుంచి మరో ఐదుగురు సిబ్బంది తప్పుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details