శరీరదారుఢ్యం కోసం తరుచూ వ్యాయామాలు చేసే వ్యక్తులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని టాలీవుడ్ సెలబ్రెటీ ఫిట్ నెస్ ట్రైనర్ కులదీప్ శెట్టి సూచించారు. ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్(puneeth rajkumar death) గుండెపోటుతో హఠాన్మరణం చెందటం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కులదీప్.. పునీత్ మరణానికి గుండెపోటే కారణమని స్పష్టంగా చెప్పలేమన్నారు.
పునీత్ కన్నుమూత.. ఫిట్నెస్ ట్రైనర్ ఏమంటున్నారు? - పునీత్ రాజ్‌కుమార్ మృతిపై ఫిట్నెస్ ట్రైనర్
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్(puneeth rajkumar death) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. జిమ్ చేస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోగా(puneeth rajkumar fitness).. ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శ్రమించినా పునీత్‌ను కాపాడలేకపోయారు. ఈ నేపథ్యంలో అసలు జిమ్ చేసే వ్యక్తుల్లో హార్ట్ ఎటాక్ ప్రమాదం ఉందా? శరీరదారుఢ్యం కోసం తరచూ వ్యాయామాలు చేసే వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ కులదీప్ శెట్టి.
పునీత్
టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, రష్మిక, రాశీ ఖన్నా సహా పలువురు సినీ ప్రముఖులకు కులదీప్ వ్యక్తిగత ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. జిమ్ చేసే వ్యక్తుల్లో బయటకు ఆరోగ్యంగా కనిపించినా.. సరైన ఆహారం, ఆరోగ్య సూత్రాలు పాటించకపోతే వ్యాయామం చేసే సమయంలో రక్తనాళాల్లో రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ విషయంలో ఏవైనా మార్పులు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. వీటితో పాటు ఇంకా పలు విషయాలు వెల్లడించారు. అవేంటో చూడండి.