దక్షిణాదిలో హీరోయిన్గా రాణిస్తున్న సమంత.. మరో అడుగు ముందుకేసి, వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇటీవలే ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. 'ద ఫ్యామిలీ మ్యాన్' పేరుతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ రెండో సీజన్లో, హీరోలా ఫైట్లు చేశానని చెప్పింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ఈ విషయాల్ని చెప్పింది.
ఆ పాత్ర కోసం సమంత భారీ పోరాట సన్నివేశాలు - బాలీవుడ్ వార్తలు
ముద్దుగుమ్మ సమంత... తాను నటిస్తున్న వెబ్‌సిరీస్ కోసం భారీస్థాయిలో పోరాట సన్నివేశాలు చేశానని చెప్పింది. ఈ విషయాన్ని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
హీరోయిన్ సమంత
"ద ఫ్యామిలీ మ్యాన్ రెండో సీజన్లో ప్రతినాయక లక్షణాలున్న పాత్ర పోషిస్తున్నా. ఇందులో హీరోలను తలపించేలా ఫైట్లు చేశా. ఇందులో నా పాత్రకు సంబంధించి, హైఓల్టేజ్ యాక్షన్ సీన్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో నటించడం చాలా ఆనందంగా ఉంది" -సమంత, నటి
ఈ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రల్లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సిరీస్.
Last Updated : Feb 29, 2020, 1:25 PM IST