తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శంకర్‌ సృష్టించిన తొలి 'రోబో' ఇదే! - aamirkhan robo

2010లో సూపర్​స్టార్​ రజనీకాంత్ 'రోబో' చిత్రం దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. 'చిట్టి'గా రజనీ చేసిన అల్లరి అంతాఇంతా కాదు. సాంకేతికంగా భారత సినిమాను మరో మెట్టు ఎక్కించిన రోబో 90ల్లోనే రావాల్సింది. మరి ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

first robo made by Shankar
శంకర్‌ సృష్టించిన తొలి 'రోబో' ఇదే..

By

Published : Jan 12, 2021, 11:32 AM IST

సూపర్​స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ మూవీ 'రోబో'. చిట్టి రోబోగా రజనీ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. 2010లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. 90వ దశకంలోనే ఈ చిత్రం రావాల్సి ఉంది. తొలుత పలువురు హీరోలను అనుకున్నా చివరికి ఈ చిత్రం రజనీతో కుదిరింది.

లోకనాయకుడితో..

అయితే మొదట ఇందులో కథానాయకుడిగా కమల్‌హాసన్‌ను అనుకున్నారు. కథానాయికగా ప్రీతి జింటాను కూడా తీసుకున్నారు. 1998లోనే ఇందుకు సంబంధించిన ఫొటో షూట్‌ చేశారు. అయితే, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు రద్దయింది. శంకర్‌కు ఉన్న విజన్‌ ప్రకారం అప్పటికి ఆ స్థాయి టెక్నాలజీ అందుబాటులో లేదు. పైగా కమల్‌హాసన్‌ కూడా వేరే చిత్రాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమా ముందుకు సాగలేదు.

కమల్, ప్రీతి జింటాల ఫొటో షూట్​

తప్పుకొన్న బాలీవుడ్ హీరోలు..

ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ శంకర్‌ 'రోబో'ను తెరకెక్కించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆమిర్‌ఖాన్‌ను కలవగా అప్పటికే ఒప్పుకొన్న చిత్రాల కారణంగా ఆయన ఈ సినిమా చేసేందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత బంతి షారుక్ కోర్టులోకి వెళ్లింది. కథానాయికగా ప్రియాంకా చోప్రాను కూడా అనుకున్నారు. కానీ శంకర్‌ సినిమా ఆలస్యమవుతుందన్న కారణంతో షారుక్‌ కూడా ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ఎట్టకేలకు రజనీని కలిశారు శంకర్‌. ఆయనకూ కథ నచ్చినందువల్ల 'రోబో' ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇదీ చూడండి:'ఈ పాట సైనికులకు, వారి భాగస్వాములకు అంకితం'

ABOUT THE AUTHOR

...view details