చేతన్ మద్దినేని హీరోగా నరేష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’. విద్య 100% బుద్ధి 0%.. అన్నది ఉపశీర్షిక. శుక్రవారం విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2015లో కన్నడ నాట సంచలన విజయం అందుకున్న ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది.
వినూత్నంగా ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ - school system
ప్రస్తుత విద్యావ్యవస్థలో పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సందేశాత్మకంగా చూపించే ప్రయత్నం చేసిన ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమా టీజర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
వినూత్న కథాంశంతో తెరకెక్కిన ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’
చదువులో ఫస్ట్ ర్యాంక్‌తో ఉన్న యువకుడు తన మంద బుద్ధి కారణంగా ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నాడు అన్న అంశాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా చూపించారు. కార్పొరేట్ విద్యా విధానం వల్ల పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు సందేశం జోడించారు. బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, నరేష్ ముఖ్య పాత్రల్లో నటించారు.