తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జేమ్స్​ బాండ్​ నుంచి కొత్త పోస్టర్ - no time to die

జేమ్స్​ బాండ్​ 25వ చిత్రంలోని తొలి పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

బాండ్

By

Published : Oct 6, 2019, 3:25 PM IST

ప్రపంచవ్యాప్తంగా జేమ్స్​ బాండ్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ఇప్పటికే ఈ సిరీస్​ నుంచి 24 చిత్రాలు వచ్చాయి. త్వరలో 25వది రాబోతుంది. 'నో టైమ్​ టు డై' టైటిల్​తో.. వచ్చే ఏడాది ఏప్రిల్​లో​ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఫస్ట్​లుక్​​ను విడుదల చేసింది చిత్రబృందం.

బాండ్ 25వ చిత్రం

డేనియల్ క్రెయిగ్.. జేమ్స్​బాండ్ ​పాత్రను పోషిస్తున్నాడు. గత 4 చిత్రాల్లో బాండ్​గా అలరించిన ఈ హీరో.. ఈ సిరీస్​లో ఇదే తన చివరి సినిమా అని చెప్పాడు. ఇందులోరాల్ఫ్ ఫియెనెస్, నొవామి హ్యారిస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత రమీ మాలిక్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కేరీ జోజి ఫుకూనాగా దర్శకత్వం వహిస్తున్నాడు. మైఖేల్ జి. విల్సన్, బార్బరా బ్రకోలీ నిర్మిస్తున్నారు.

ఇవీ చూడండి.. వారి కోసం పెయింటింగ్ వేసిన సన్నీ లియోనీ

ABOUT THE AUTHOR

...view details