తమిళ హీరో సూర్య ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు కె.వి ఆనంద్ తెరకెక్కిస్తున్న 'కాప్పన్' లో రా ఏజెంట్గా కనిపించనున్నాడు. అతడికి సంబంధించిన లుక్నుఆదివారం విడుదల చేయనుంది చిత్రబృందం. అదే రోజు తమిళుల కొత్త సంవత్సరం. ఆగస్టు 10న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుందీ చిత్రం.
ఇది కాకుండా ఎన్.జి.కె సినిమాలోనూ నటిస్తున్నాడు సూర్య. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు. రకుల్ ప్రీత్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించారు.