తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా నేపథ్యంలో ప్రశాంత్​ వర్మ కొత్త చిత్రం - కరోనా వైరస్​ పోస్ట

కరోనా వైరస్​ నేపథ్యంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్​ వర్మ. తాజాగా దీనికి సంబంధించిన ఓ పోస్టర్​ను విడుదల చేశాడు. మార్చి 29న ప్రీలుక్​ విడుదల చేసి మరిన్ని విశేషాలు పంచుకుంటానన్నాడు ప్రశాంత్​.

prasanth varma
ప్రశాంత్​ వర్మ

By

Published : May 28, 2020, 4:45 PM IST

వైవిధ్యభరిత కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్​గా నిలిచాడు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. అతడి నుంచి వచ్చిన 'అ!' చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కగా.. రాజశేఖర్‌తో చేసిన 'కల్కి' విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడిదే పంథాలో మరో ప్రయోగాత్మక చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడీ యువ దర్శకుడు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ కథా నేపథ్యంతో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్‌కి సంబంధించిన హింట్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేశాడు ప్రశాంత్‌.

అంతేకాదు రేపు ఉదయం 9:00 గంటలకు విడుదలయ్యే ప్రీలుక్‌తో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు పంచుకోనున్నట్లు తెలియజేశాడు.

కరోనా వైరస్​

ఇదీ చూడండి : ఎన్టీఆర్​కు ఆ వేషం వేయాలని కోరిక.. కానీ!

ABOUT THE AUTHOR

...view details