కాశ్వీ నాయర్ దర్శకత్వంలో మూడు తరాల ప్రేమకథా నేపథ్యంగా బాలీవుడ్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అర్జున్ కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో మరో ఇద్దరు బాలీవుడ్ నటులు చేరారు. జాన్ అబ్రహం, అదితీరావు హైదరీలు కీలకపాత్రలు పోషించనున్నారని తెలిపింది చిత్రబృందం.
ఈ చిత్రానికి జాన్ అబ్రహం, నిఖిల్ అడ్వాణీలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండోర్ షూటింగ్‌లో ఒక వారం పాటు జాన్, అదితీలు పాల్గొననున్నారు. మళ్లీ అక్టోబర్‌లో అవుట్‌డోర్ షూటింగ్‌లో హీరోహీరోయిన్లతో కలిసి పాల్గొంటారు. అదితి .. అర్జున్ కపూర్‌కు అమ్మమ్మ పాత్రలో నటించనుందని సమాచారం.