సోమవారం హీరో రానా పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన నటించిన 'విరాట పర్వం' సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియో సినిమాపై అభిమానుల్లో అంచనాల్ని పెంచుతోంది. రానా మావోయిస్ట్ లుక్ అదిరిపోయింది.
టీజర్: 'దేశం ముందు అతని జీవితం ఓ ప్రశ్న'
దగ్గుబాటి రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'విరాట పర్వం'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రానా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియో ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
డి.సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్. ప్రియమణి, నివేదా పేతురాజ్, నందితాదాస్, ఈశ్వరీరావు, జరీనా వహాబ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
1990లో డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న అనే నక్సలైట్ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతినిది, సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిదంటూ కామ్రేడ్ రవన్న జీవితాన్ని రానా పాత్రలో అద్భుతంగా చూపించారు దర్శకుడు వేణు.