తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మిస్టర్ అండ్ మిస్​కు తొలి ముద్దు యాక్సిడెంట్ అట..! - crowd funding film

'మిస్టర్ అండ్ మిస్' చిత్రంలోని పోస్టర్ నేడు విడుదలైంది. సైలేశ్ సన్నీ, జ్ఞానేశ్వరీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకుంటోంది.

మిస్టర్ అండ్ మిస్

By

Published : Oct 29, 2019, 1:43 PM IST

క్రౌడ్ ఫండింగ్(ప్రజల నుంచి విరాళాల)​ ద్వారా నిర్మితమైన చిత్రం 'మిస్టర్ అండ్ మిస్'. ఈ సినిమాలోని పోస్టర్ నేడు విడుదలైంది. హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీని చూపిస్తూ విడుదల చేసిన ఈ ఫొటో ఆకట్టుకుంటోంది. సైలేశ్ సన్నీ, జ్ఞానేశ్వరీ నాయకానాయికలు.

మిస్టర్ అండ్ మిస్ పోస్టర్

హీరోహీరోయిన్ల పాత్రలను వివరించేలా రూపొందిన పోస్టర్ సినిమాపై ఆసక్తిరేపుతోంది. పల్లెటూరు అబ్బాయి, పట్నం అమ్మాయి మధ్య ప్రేమను రొమాంటిక్ కోణంలో తెరకెక్కించింది చిత్రబృందం. 'ఫస్ట్ కిస్ వాజ్ యాన్ యాక్సిడెంట్' అనే క్యాప్షన్​తో ఆకట్టుకుంటోందీ పోస్టర్.

రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ బ్యానర్​పై వస్తున్న ఈ సినిమాకు అశోక్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సుధీర్ వర్మ స్క్రీన్​ప్లే, డైలాగ్స్​ అందించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి: గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీతకు 'చిరు' సత్కారం

ABOUT THE AUTHOR

...view details