హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షం కారణంగా గౌలిగూడలో నాలుగేళ్ల దివ్య... ప్రమాదవశాత్తూ నాలాలో పడిపోయింది . ఆ సమయంలో చాకచక్యంతో వ్యవహరించి ఆ పాప ప్రాణాలు కాపాడారు అగ్నిమాపక సిబ్బంది.
మెగాస్టార్ మెచ్చిన ఫైర్‌మెన్- రూ.లక్ష సాయం
నాలాలో పడిపోయిన చిన్నారిని కాపాడినందుకు ఓ ఫైర్‌మెన్, సిబ్బందిని ప్రశంసించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ట్రస్టు నుంచి లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.
అప్పుడు తీసిన ఓ వీడియో ప్రసార మాధ్యమాల్లో చూశారు మెగాస్టార్ చిరు. చిన్నారి దివ్యను మృత్యువు నుంచి కాపాడిన ఫైర్‌మెన్ క్రాంతికుమార్‌ను మెచ్చుకున్నారు. తర్వాత చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.లక్ష బహుమతిగా అందజేశారు. ఈ మేరకు నిర్మాత అల్లు అరవింద్ సంబంధించిన నగదు అందజేసి...ఫైర్‌మెన్‌కు సత్కారం చేశారు. క్రాంతి కుమార్‌కు సహకరించిన ఫైర్ సిబ్బందిని, గౌలిగూడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జయరాజ్ కుమార్‌ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ప్రాణాలతో బయటపడిన దివ్యకు అండగా ఉంటామని అల్లు అరవింద్ తెలిపారు.