బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'కూలీ నెంబర్.1'. సారా అలీఖాన్ హీరోయిన్. ముంబయిలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రం కోసం వేసిన సెట్లో మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అప్రమత్తతతో వ్యవహరించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలు అదుపులోకి తేవడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
'కూలీ నెంబర్.1' సెట్లో భారీ అగ్ని ప్రమాదం - సారా ఆలీఖాన్
వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న 'కూలీ నెంబర్.1' సెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముంబయిలో మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ సంఘటన జరిగింది.
'కూలీ నెంబర్.1' సెట్లో భారీ అగ్ని ప్రమాదం
1995లో బాలీవుడ్లో వచ్చిన 'కూలీ నెంబర్.1'కు ఇది సీక్వెల్. ఈ సినిమా కోసం తొలిసారి కలిసి నటిస్తున్నారు వరుణ్-సారా. పరేశ్ రావల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: 'సినీ రంగం నాకు నేర్పిన పాఠాలెన్నో'
Last Updated : Sep 30, 2019, 5:55 AM IST